Breaking News

గతవలోకనం…. గులాబీమయం… రాజకీయం… ఎత్తుపల్లాలు లేని ఓటరు నాడి

నిజామాబాద్‌ ప్రతినిధి – వై.సంజీవయ్య

2014వ సంవత్సరం రాజకీయ మార్పులతో పాటు ఏన్నో గుర్తులను తీపి చేదు అనుభవాలను మిగిల్చింది. ప్రధానంగా రాజకీయంగా కీలక మార్పులకు కారణం అయింది. తెలంగాణ ఉద్యమంలో జిల్లా కీలక పాత్ర పోషించడమే కాకుండా రాజకీయంగానూ ఆదే ముద్ర వేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సహకారంతో పాటు రాజకీయంగా సమూల మార్పులకు అవకాశం కల్పించింది 2014. పదేళ్లుగా తనదైన ముద్ర వేసుకున్న కాంగ్రెస్‌కు జిల్లాలో ఎదురు దెబ్బ తగిలింది. ఏకంగా సాధారణ ఎన్నికల్లో తోమ్మిది శాసన సభ నియోజకవర్గాల్లో తోమ్మిదింటిని టిఆర్‌ఎస్‌ కౌవసం చేసుకుంది. అదే తరహాలో స్థానిక సంస్థల్లోనూ ఇదే తంతు కొనసాగింది. ఏకంగా జడ్పీ పీఠాన్ని సైతం అత్యధిక మెజారిటీతో గెలుచుకుంది. 2001లో జరిగిన టిఆర్‌ఎస్‌ జడ్పీని కైవసం చేసుకుంది. అనంతరం సరిగ్గా పదేళ్లకు మళ్లీ టీఆర్‌ఎస్‌కే దక్కింది. దీనికి తోడు రెండు పార్లమెంట్‌ స్థానాల్లోనూ టిఆర్‌ఎస్‌ జండా ఎగరవేడయంతో జిల్లా మొత్తం రాజకీయంగా గులాబీమయం అయింది. మరోపక్క మున్సిపాలిటీల్లోనూ టిఆర్‌ఎస్‌ జండాలే రెపరెపలాడాయి.

మొండి చేయి…

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు జిల్లాలో మొండి చేయి దక్కింది. రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన పంతం నెగ్గించుకొని జిల్లాలో పగా వేసింది. తనదైన ముద్ర వేసుకున్న కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఇబ్బందులతో గురి కాగా, కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో కొంత మెరకు ఆశలు పెంచుకుంది. మరోపక్క టిడిపి ఉద్యమం తాకిడితో కొలుకొలేకపోయింది. అప్పటికే టిడిపిలోని ఆశవాహులు మాత్రమే ఏకంగా కారు ఎక్కెసారు. దీంతో టిడిపి నామ మాత్రపు పోటికి పరిమితం అయింది. అనంతరం తెలంగాణ ఉద్యమం సెగకు కాంగ్రెస్‌, టిడిపిలు చితలకబడ్దాయి. ఈ ఉద్యమంతో టిఆర్‌ఎస్‌ మరింత ప్రాధాన్యత పెంచుకుంది. జెఎసీలతో కలిసి ఉద్యమంలో టిఆర్‌ఎస్‌ ఆమోగమైన పాత్ర పోషించి రాజకీయంగా కెరటాలకు ఎగిసింది. ఈ తంతు స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపాలిటీ, సాధారణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ హవా కోనసాగింది.

కవిత మార్క్‌…

జిల్లాలో ఎంపి కవిత మార్క్‌ కొనసాగింది. స్వయనా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూతురు కావడంతో పాటు జిల్లాకు కొడలు. దీనికి తోడు జిల్లా నుంచి ఎంపిగా గెలిచిన తొలి మహిళ కావడం విశేషం. గత అయిదేళ్లుగా జిల్లాతో అనుబంధం పెంచుకొని తెలంగాణ జాగృతి పేరుతో పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. దీనికి తోడు బతుకమ్మ పేరుతో కీలక భూమిక పోషించారు. ఎంపిగా గెలవడంతో రాజకీయంగా మరింత కీలకంగా మారారు.

ఆశల గల్లంతు…

జిల్లాలో టిఆర్‌ఎస్‌ గాలి వియడంతో నలుగురు నేతలు మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారు. ప్రధానంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏల్లారెడ్డి రవిందర్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, కామారెడ్డి గంపగోవర్థన్‌లున్నారు. అయితే వీరిలో మొదటి దఫాలోనే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అవకాశం దక్కి , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. రెండో దఫాలో గంప గోవర్థన్‌కు విప్‌గా మాత్రమే అవకాశం లబించింది. మిగిలిన వారి మొండి చేయి చూపించారు. ఇదే కోవలో మూడు సార్లు పోటీ చేసి మొదటిసారి గెలిచిన బోధన్‌ ఎమ్మెల్యే షకిల్‌కు విప్‌గా అవకాశం లబిస్తుందని విస్త్రతంగా చర్చ జరిగిన అవకాశం లేకుండా పోయింది. ఇదే కోవలో జిల్లాలో కీలకమైన జడ్పీ చైర్మన్‌ పదవిపై మల్లాగుల్లాలు కొనసాగిన చివరకు నిజాంసాగర్‌ జడ్పీటీసీ రాజుకు పీఠం దక్కింది.

రాజకీయ అవలోకనం…

మార్చి 5 – లోక్‌సభ, అసేంబ్లీ ఎన్నికలకు షేడ్యూల్‌ విడుదల. 10న జడ్పీటీసీ, ఎంపిటీసీల నోటీఫికేషన్‌ జారీ. 30న మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.

ఏప్రిల్‌ 6 – మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు, 11న రెండో విడత ఎన్నికలు జరిగాయి.

ఏప్రిల్‌ – 22 జిల్లాలో నరేంద్రమోడి ఎన్నికల ప్రచారం, 21 రాహుల్‌గాంధీ, 24న కెసిఆర్‌, 27న చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేసారు. ఏప్రిల్‌ – 30 ఎన్నికలు పోలీంగ్‌ జరిగింది.

మే – 16 ఏన్నికల ఫలితాల విడుదల. 13న జడ్పీటీసీ ఫలితాల ప్రకటన, 12న మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల విడుదల.

జూన్‌ – 2న తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఏర్పాటు జిల్లా నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకారం.

జూలై – 5న జడ్పీ చైర్మన్‌గా నిజాంసాగర్‌ జడ్పీటీసీ దాఫెదార్‌ రాజు ప్రమాణ స్వీకారం. 3న నిజామాబాద్‌ నగర మేయర్‌గా ఆకుల సుజాత ప్రమాణ స్వీకారం చేసారు.

ఆగస్టు 7న మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన.

అక్టోబరు – 29న డిప్యూటీ సీఎం, వైద్య శాఖ మంత్రి రాజయ్య జిల్లా పర్యటన చేసారు.

డిసెంబరు – 5న మంత్రి హారిష్‌రావు జిల్లాలో పర్యటన. 13న ప్రభుత్వం చీఫ్‌ వీప్‌గా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్‌కు నియమాకం. 17న జిల్లా ప్రణాళిక సంఘం ఎన్నికల నిర్వహణ, ఛైర్మన్‌గా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *