Breaking News

అర్థరాత్రి తాళం వేసిన ఇంటికి నిప్పు

-బంగారం, నగదు దోపిడీ

-నగరంలో కలకలం

నిజామాబాద్‌ క్రైం, జనవరి 14;

నిజామాబాద్‌ నగరంలోని న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో బంగారం, నగదు దోచుకొని ఏకంగా ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన నిజామాబాద్‌ నగరంలో కలకలం రేపింది. నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో నాగేశ్వరరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలోని కంఠేశ్వర్‌ న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీలో మాక్లూర్‌కు చెందిన చింతల లత(43) పండిత్‌ ఇంట్లో ఆరు సంవత్సరాలుగా ఇంట్లో లత, ఆమె కుమారుడు రామాకాంత్‌ అద్దెకు ఉంటున్నారు. రామాకాంత్‌ కాంట్రాక్టర్‌ పని చేస్తున్నాడు. బుధవారం ఇంటికి తాళం వేసి సంక్రాంతి పండగ సందర్భంగా మాక్లూర్‌ మండలం లక్నాపూర్‌కు వెళ్లారు. అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులకొట్టి ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం, కిలో వెండి, రూ.1.50లక్షల నగదు, ప్లాస్మా టివిని దొంగిలించారు. అనంతరం ఈ ఇంటికి మొత్తం నిప్పు పెట్టారు. ఇంటి పక్కనే ఉన్న భర్గవరెడ్డి విషయాన్ని గమనించి 100కు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అర్పివేసారు. ఈ మేరకు రూరల్‌ ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా చేసి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది ఇంటిలో తనిఖీ చేసిన డాగ్‌ సమీపంలోని జన్మభూమి రోడ్డులోని వైన&్స వరకు వచ్చి వెనుదిరిగింది. ఈ మేరకు పోలీసులు పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *