Breaking News

భృతి కార్మికుల హక్కు… ఐఎఫ్‌టియు జాతీయ అధ్యక్షెడె డివి.కృష్ణ

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 24:

బీడీ కార్మికుల కారణంగా ప్రభుత్వానికి లక్షల రూపాయాల అదాయం వస్తుందని, బీడీ కంపెనీలు కోట్ల రూపాయాలు దండుకుంటున్నాయని, కాని కార్మికుల మాత్రం జీవన భృతిని కల్పించేందుకు ప్రభుత్వాలు వెనకడుతున్నాయని ఐఎఫ్‌టియూ జాతీయ అధ్యక్షుడు డివి.కృష్ణ అన్నారు. శనివారం బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించాలని, పరిశ్రమను కాపాడాలని డిమాండ్‌ చేస్తు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. అంతకు ముందే నగరంలోని భారీర్యాలీని నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన డివి.కృష్ణ ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది కార్మికులు పని చేస్తున్నరని, వారి సంక్షేమానికి ఇంత వరకు ఏ ప్రభుత్వం నయా పైసా బడ్జెట్‌లో కెటాయించలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కార్మికులను ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు బీడీ కార్మికుల బృతికి సంబంధించిన మానిఫెస్టోలో పెట్టిన, గెలిచక వాటిని పూర్తిగా మరిచిపోయారన్నారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో పని చేస్తున్న 80 శాతం మంది మహిళలు వివిధ రోగాల భారీనపడుతున్నారని, వీరికి కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. కాబట్టి ఖచ్చితంగా కార్మికులకు ప్రతి నెల జీవన భృతి ఇవ్వాలని, లేదా ఇచ్చే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సిపిఐ ఎంఎల్‌ న్యూడెమాక్రసీ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి మాట్లాడుతూ బీడీ కార్మికుల పోరాటానికి మా మద్దతు పూర్తిగా ఉంటుందని, అందుకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర కార్యదర్శి నరేందర్‌, జిల్లా నాయకులు ముత్తన్న, వెంకట్‌, రాజన్న దేవరాం, భూమేశ్వర్‌, సత్తెక్క తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండగల వివరాలు

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *