Breaking News

పోలీసు యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేయాలి.

నిజామాబాద్‌, జనవరి 27:

నిజామాబాద్‌, న్యూస్‌ డాట్‌ ఇన్‌: పోలీసు యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేసినప్పుడే సమాజంలో శాంతిభద్రతలు నెలకొంటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకోసం పోలీసు వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రభుత్వం గత జూలై 16న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వారికి వాహనాలు, సి.సి కెమెరాలు ఇతర ఆధునీకరణ సదుపాయాల కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రత్యేకంగా 312 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ పది జిల్లాలకు ద్యిచక్ర వాహనాలు 1500, నాలుగు చక్రాల వాహనాలు 1500, అన్ని హంగులతో ఏర్పాటు చేసి అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాకు 44 వాహనాలు కేటాయించగా ఈ రోజు పోలీసు స్టేషన్‌లకు అందచేస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా డిఐజి వై.గంగాధర్‌ మాట్లాడుతూ, పోలీసులు సమర్తవంతంగా సేవలందించాలని, ప్రజలతో సమన్వయంగా ఉండి సమాజంలోని నేరాలు అరికట్టడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఎస్‌.పి. చంధ్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహభావంతో ఉండాలని, ఫెండ్ల్రీ పోలీస్‌గా పేరు తెచ్చుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం పోలీస్‌ స్టేషన్‌ మెయింటెనెన్స్‌కు 3000 మాత్రమే ఇవ్వగా తెలంగాణా ప్రభుత్వం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు 65000, హర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌కు 60000 మెయింటెనెన్స్‌కు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి వి.జి. గౌడ్‌, జడ్పీ చైర్‌మెన్‌ డి. రాజు, మున్సిపల్‌ కార్పోరేషన్‌ మేయర్‌ ఆకుల సుజాత, శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్త , ఎనుగు రవీందర్‌ రెడ్డి, హన్మంథ్‌ షిండే, ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి, 11వ బెటాలియన్‌ కమాన్‌డెంట్‌ శ్రీనివాస్‌ రావు, అదనపు ఎస్పీ పాండునాయక్‌, డియస్పీలు, సిఐలు. ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండగల వివరాలు

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *