Breaking News
bjp

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణ బిజెపి కార్యాలయం వద్ద బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ సిద్దిరాములు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బిజెపిని స్థాపించి నేటికి 35 సంవత్సరాలు అవుతోందని తెలిపారు.

ఈకాలంలో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడి మూడుసార్లు అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. పీడిత పాలననుంచి ప్రజలను విముక్తులను చేసి ప్రజలకు సుపరిపాలన అందించామని తెలిపారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో మోడి ప్రభుత్వానికి పట్టం కట్టి ప్రజలకు బిజెపి పట్ల ఉన్న విశ్వసనీయతను మరోమారు చాటుకున్నారని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్నట్టుగా పాలన అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు మోతె కృష్ణాగౌడ్‌, చింతల రమేశ్‌, నరేశ్‌రెడ్డి, బాలాజీ, జంగిటి నరేశ్‌, వడ్ల శ్రీను, దేవరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

వాక్సినేషన్‌ కేంద్రాలు పెంచాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కేంద్రాల‌లో వాక్సినేషన్‌ పాయింట్స్‌ పెంచాల‌ని, 45 సంవత్సరముల‌ ...

Comment on the article