Breaking News
kamareddy municipality

సిసి డ్రైన్‌ పనులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 1వ వార్డులో సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సిసి డ్రైన్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో సిసి డ్రైన్‌ పనులు చేపడుతున్నట్టు తెలిపారు.

అందులో భాగంగానే 1వ వార్డుకు సైతం నిదులు కేటాయించామన్నారు. అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కాళ్ళ గణేశ్‌, నాయకులు రాంకుమార్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article