Breaking News
joharlu police

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి – మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ

కామారెడ్డి, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం బ్రిలియంట్‌ గ్రామర్‌ హైస్కూల్‌, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నల్గొండ ఘటనలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు.

ప్రజలకు రక్షణ కల్పించేందుకు అహర్నిశలు పాటుపడుతూ తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించే పోలీసుల సేవలను కొనియాడారు. తీవ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించడంలో భాగంగా నల్గొండలో తీవ్రవాదులతో పోరాడిన కానిస్టేబుల్‌ నాగరాజు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

సంఘటనలో గాయపడ్డ మిగతా పోలీసులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు సంతోష్‌, శోభన్‌, కౌన్సిలర్లు పద్మ, జమీల్‌, ప్రిన్సిపాల్‌ సురేశ్‌ డానియల్‌, నాయకులు రాంకుమార్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article