Breaking News
municipal chairperson

అభివృద్ధి పనులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాల ప్రకారం హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్టు తెలిపారు. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యాదమ్మ, బట్టు మోహన్‌, ఏ.ఇ. గంగాధర్‌, నాయకులు రాజేందర్‌, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Development works started in kamareddy, CC Drain works Started in kamaredd

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article