Breaking News
bjp mahila morcha

బిజెపి పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం, – బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతారెడ్డి

కామారెడ్డి, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నరేంద్ర మోడి ఆధ్వర్యంలోని బిజెపి పాలనలో కేంద్ర ప్రబుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తుందని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతారెడ్డి అన్నారు. కామారెడ్డిలో మంగళవారం నిర్వహించిన మహిళా మోర్చా సభ్యత్వ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్‌, విద్య, ఉద్యోగం, ఉపాధి తదితర వసతుల కల్పనలో బిజెపి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు.

మోడి ఆశయాలకు అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. జిల్లాలో మహిళా మోర్చాలో 20 వేల సభ్యత్వాలకు మించి నమోదు చేయించాలని నాయకులకు సూచించారు. ప్రజా సమస్యల్లో నాయకులు పాలుపంచుకోవాలని సూచించారు. అనంతరం మహిళా మోర్చా పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కె.లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా శహీరాబాను, ఉపాధ్యక్షురాలిగా బాలమణి, తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిద్దిరాములు, కౌన్సిలర్‌ కిష్టాగౌడ్‌, పట్టణ అధ్యక్షులు చింతల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Woman got outmost important in BJP Ruling Kamareddy, BJP Woman state president kamareddy

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article