Breaking News
court

మంత్రిని అడ్డుకున్న కేసులో కోర్టుకు హాజరు

కామారెడ్డి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 18న సదాశివనగర్‌ మండలంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని అడ్డుకొని వాగ్వాదానికి దిగిన కేసులో 15 మంది సిఐటియు నాయకులు బుధవారం కామారెడ్డి కోర్టులో హాజరయ్యారు. బీడీ కార్మికుల జీవనభృతికి సంబంధించి జనవరి 18న మంత్రి పోచారంను సిఐటియు నాయకులు అడ్డుకున్నారు.

ఈ విషయంలో సిఐటియు నాయకులకు మంత్రికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి 15 మంది నాయకులపై కేసు నమోదు చేశారు. కోర్టుకు హాజరైన నాయకులు బెయిల్‌పై బయటకు వచ్చారు. కోర్టుకు హాజరైన వారిలో రాజలింగం, సిద్దిరాములు, ఎల్లయ్య, సదానందం, లింబాద్రి, నారాయణ, సాయిరెడ్డి తదితరులున్నారు.

CITU Union Leaders Attended Court in case of Stopping Minister Pocharam Srinivas kamareddy

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article