Breaking News
mahila upadi

ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలి

– మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ

కామారెడ్డి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువతీయువకుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను వినియోగించుకొని తద్వారా లబ్దిపొందాలని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డిలో మెప్మా, మునిసిపల్‌ ఆద్వర్యంలో నిరుద్యోగ మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నిరుద్యోగ యువతులు, మహిళల కోసం మెప్మా ఆధ్వర్యంలో 3 నెలలపాటు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని ఆమె పేర్కొన్నారు. మునిసిపల్‌ కమీషనర్‌ విక్రమసింహారెడ్డి మాట్లాడుతూ శిక్షణలో 3 నెలలపాటు తప్పకుండా అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా హాజరు ఉంటుందని, తరగతులకు రాకపోతే శిక్షణ కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article