కామారెడ్డి, ఏప్రిల్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని పివి.నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయం డైరీ కళాశాల 6వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ డీన్ ఆచార్య రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ డైరీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు.
డైరీ కోర్సు పూర్తవగానే విద్యార్థులకు స్వదేశంతో పాటు విదేశాల్లో సైతం అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలోని ఏకైక డైరీ కళాశాల కామారెడ్డిలో ఉందని, విద్యార్థులు డైరీలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.
అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వీరోజీరావు, అసోసియేట్ డీన్ గంగారావు, ప్రొఫెసర్లు రాజుగోపాల్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
Dairy college Anniversary was celebrated very Grandly Kamareddy

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018