– ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి, ఏప్రిల్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ తో చెరువుల పునరుద్దరణ చేసి తద్వారా రైతులు బంగారు పంటలు సాగుచేసుకునేందుకు కృషి చేస్తున్నట్టు ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలోని భిక్కనూరు మండలంలో బాగిర్తిపల్లి, ఇస్సన్నపల్లి, తిప్పాపూర్ గ్రామాలను సందర్శించి మిషన్ కాకతీయ పనులను, పలు అభివృద్ది పనులనుసైతం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం కారనంగా చెరువులు నిరాదరణకు గురయ్యాయని, దాని ఫలితంగా చెరువుల్లో నీరు ఎండిపోయి రైతులు కష్టకాలం ఎదుర్కొంటున్నారని అన్నారు.
మిషన్ కాకతీయతో చెరువు పూడికతీత, తూముల మరమ్మతులు, పంట కాలువలు, తదితర పనులను పూర్తిచేసి చెరువులు నీటితో కళకళలాడేలా చేస్తామని అన్నారు. చెరువులు అభివృద్ది చెందితేనే గ్రామాలు, రైతులు అభివృద్ధి చెందుతారని, దీన్ని కేవలం ప్రభుత్వ పథకంగా మాత్రమే భావించకుండా అందరి పథకంలా భావించి పథకాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం 40 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పనులను ప్రారంభించిందని తెలిపారు. పథకంలో మొదటి విడతగా కామారెడ్డి నియోజకవర్గానికి నీరు సరఫరా అవుతుందన్నారు. కేసీఆర్ వాగ్దానం చేసినట్టుగా గడప గడపకు మంచినీటిని అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి రాజయ్య, జడ్పిటిసి నంద రమేశ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Government vip Gampa Goverdhan Says mission kakateya helps farmers for better crops in Kamareddy Mission kakateya program

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018