Breaking News
mana ooru mana cheruvu

చెరువుల అభివృద్ధితోనే రైతన్న అభివృద్ధి… – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరువులు అభివృద్దిచెందితేనే రైతన్న పంట పొలాలు పచ్చగా ఉంటాయని తద్వారా రైతులు అభివృద్ది చెందుతారని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని దోమకొండ మండలంలో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువుల పునరుద్దరణ చేసేందుకు మిషన్‌ కాకతీయను చేపట్టామని, తద్వారా చెరువుల్లో లభ్యమయ్యే మట్టిని రైతులు తమ పంట పొలాలకు తరలించుకొని రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు.

దీనిద్వారా చెరువుల్లో పనులు జరగడంతోపాటు రైతుల పంట పొలాల్లో మట్టి సైతం లభిస్తుందని చెప్పారు. సాగునీటి సమస్య శాశ్వతంగా తీర్చడానికి ముక్యమంత్రి కేసీఆర్‌ వాటర్‌ గ్రిడ్‌పనులను చేపట్టారని, పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలందరికి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. అర్హులైన వారందరికి బీడీ కార్మిక జీవనభృతి పింఛన్ల అందజేస్తామన్నారు. మిషన్‌ కాకతీయనుకేవలం ప్రభుత్వ పథకం అనుకోకుండా అన్ని వర్గాల ప్రజలు తమ బాగుకోసమనుకొని అందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతన్నకు వెన్నుదన్నుగా నిలిస్తేనే దేశం బాగుపడుతుందని చెప్పారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఆర్డీవో నగేశ్‌, డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబోద్దీన్‌, జడ్పిటిసి మధుసూదన్‌, తదితరులు పాల్గొన్నారు.

MLA Gampa Govardhan kamareddy, Development of Lakes Develops Farmers

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article