కామారెడ్డి, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నత లక్ష్యంతోనే వ్యక్తికి గుర్తింపు లభిస్తుందని, ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని ఆ దిశగా ముందుకు సాగాలని ప్రముఖ కెరీర్ గైడెన్స్ అడ్వయిజర్ అనిల్‌కుమార్ సూచించారు. కామారెడ్డి పట్టణంలోని కర్షక్ బిఇడి కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం లైఫ్ అండ్ కెరీర్‌పై సెమినార్ నిర్వహించారు. సెమినార్లో అనిల్‌కుమార్ మాట్లాడుతూ మనిషి లక్ష్యాన్ని బట్టి గుర్తింపు లభిస్తుందని, మంచి లక్ష్యాన్ని ఎంచుకొని మంచి గుర్తింపును తెచ్చుకోవాలని సూచించారు.
చిన్నప్పటి నుంచే ఓ లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా అడుగులువేసినపుడు జీవితం ఉన్నతంగా ఎదగడానికి దోహదపడుతుందని సూచించారు. గొప్ప లక్ష్యాన్ని ఎంచుకొని చేరుకుంటే సమాజంలో వ్యక్తిగా గొప్ప గుర్తింపు సాధిస్తారని చెప్పారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రషీద్, లెక్చరర్లు రామ్మోహన్, బాలు, రేణుక, రఫీ, తదితరులు పాల్గొన్నారు.
Career Guidance Adviser Anil Kumar says Identification gets only for Top Place Kamareddy

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018