Breaking News
coaching centre

సంప్రదాయ విద్యల కన్న, సాంకేతిక విద్యే మిన్న

కామారెడ్డి, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టెక్నాలజి విస్తరిస్తున్న తరుణంలో సంప్రదాయ విద్యల కన్నా సాంకేతిక విద్యే మిన్న అని వాణి విద్యాలయం ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి అన్నారు. కామరెడ్డి పట్టణంలో శుక్రవారం రామన్‌ పాలిటెక్నిక్‌, టిఎస్‌ ఆర్‌జేసి కోచింగ్‌సెంటరు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరై రమాదేవి ఉపన్యసించారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే సంప్రదాయ విద్యతోపాటు సాంకేతిక విద్యల్లో కూడా రాణించాలని సూచించారు. రామన్‌ కోచింగ్‌ సెంటరు అందుకు ఉపకరిస్తుందని అన్నారు. విద్యార్థులు కోచింగ్‌ సెంటరును ఉపయోగించుకొని ర్యాంకులు సాధించాలని అన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్‌ జమీల్‌, లయన్స్‌ క్లబ్‌ డైరెక్టర్‌ రామ్మోహన్‌, కోచింగ్‌ సెంటరు డైరెక్టర్‌ రాజు, నాయకుడు రాంకుమార్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

శ్రీనివాస్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం ఆంగ్ల విభాగపు పరిశోధక విద్యార్థి ఎ. ...

Comment on the article