Breaking News
arikela

ప్రభుత్వం తన చిత్తశుద్దిని చేతల్లో చూపాలి ..

– టిడిపి జిల్లా కన్వీనర్‌ అరికెల నర్సారెడ్డి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం తమ చిత్తశుద్దిని మాటల్లో కాకుండా చేతల్లో చూపాలని టిడిపి జిల్లా కన్వీనర్‌, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు. కామారెడ్డిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నప్పటికి పనుల్లో మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటర్‌గ్రిడ్‌ ద్వారా నాలుగేళ్లలో ఇంటింటికి నీటి సరఫరా చేస్తామనిచెబుతున్నారని, కానీప్రస్తుతం నీటి ఎద్దడితో ప్రజలు రోడ్లమీదికి వచ్చి తన్నుకుంటున్నారని, ఇప్పుడేం చేయదలుచుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఎప్పుడో చేయబోయే పనుల గురించి గొప్పలు చెప్పుకోవడం ఎందుకని ప్రశ్నించారు. రైతులకు ఎంత రుణమాపీ చేశారో, ఎవరెవరికి చేశారో, ఎంత చేశారో ప్రభుత్వం వివరించాలని డిమాండ్‌ చేశారు.

టిడిపి పథకాలనే తెరాస పేరుమార్చి కొత్త పథకాలుగా ప్రవేశపెడుతుందని విమర్శించారు. మిషన్‌ కాకతీయలో ఆర్భాటాలు ఎక్కువ, పని తక్కువైందని ఎద్దేవా చేశారు. పనులు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పాలని అన్నారు. టిడిపి మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ఫ్లోరైడ్‌ ప్లాంట్‌లను పునరుద్దరించి తద్వారా ప్రజలకు మంచినీటిని సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చీల ప్రభాకర్‌, నజీరుద్దీన్‌, ఉస్మాన్‌, సంజీవ్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

TDP Nizamabad District Convener  Arikela Narsa Reddy Comments on Government, Government should show their performance in works not in words

Check Also

అల‌క్ష్యం చేస్తే చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ...

Comment on the article