కామారెడ్డి, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని గంజివర్తక సంఘం ధర్మశాల ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం ఘనంగా నిర్వహించారు.
శ్రీమన్మధనామ సంవత్సరం అధిపతి శనీశ్వరుడు కావడం వల్ల శనిదోష నివారణ కోసం శ్రీగణపతి సచ్చిదానంద స్వామి ఆదేశాల మేరకు హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం చేస్తున్నట్టు గంజి వర్తక సంఘం సభ్యులు తెలిపారు. వందలాది మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.ప్రతి మంగళవారం, శనివారం యజ్ఞం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు లక్ష్మిపతి, శ్రీనివాస్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
Hanuman Chalisaa recitation Yagna Kamareddy

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018