Breaking News

పొంచిఉన్న మరో ‘భారీ’ భూకంపం

-నేపాల్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ తీవ్రత

న్యూఢిల్లీ: నేపాల్‌లో వచ్చిన భూకంపం ప్రపంచాన్ని కదిలించింది. ఇప్పుడు నేపాల్లో వచ్చిన భూకంపై తీవ్రత 7.9గా ఉంది. త్వరలో మరో భారీ భూకంపం వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2018కి అటు ఇటుగా ఈ భారీ భూకంపం ఉండవచ్చునని చెబుతున్నారు.

ఈ భూకంపం కూడా సెంట్రల్ హిమాలయాల్లో ఉండవచ్చునని చెబుతున్నారు. తదుపరి ఆ భారీ భూకంపం హిమాలయాల్లోనే ఉండవచ్చునని, దాని ప్రభావం బాగా ఉంటుందని చెబుతున్నారు. నేపాల్లో వచ్చిన భూకంపం తీవ్రత 7.9గా ఉందని, తదుపరి వచ్చే భారీ భూకంపం తీవ్రత 9గా ఉండవచ్చునని అంటున్నారు. నేపాల్లో వచ్చిన భూకంపానికి 40 రెట్లు ఆ భారీ భూకంపం ఉండవచ్చునని అంటున్నారు. ఈ భారీ భూకంపం ప్రపంచంలో ఎక్కడైనా రావొచ్చునని, ప్రధానంగా సెంట్రల్ హిమాలయాల్లో రావొచ్చునని అంటున్నారు. భారీ భూకంపం వస్తే హిమాలయ పరిసరాలు దెబ్బతింటాయి. హిమాచల్ ప్రదేశ్ నుండి వెస్ట్ నేపాల్ వరకు దీని ప్రభావం పడవచ్చునంటున్నారు. అయితే, కచ్చితంగా ఆ భూకంపం ఎప్పుడు వస్తుందో మాత్రం అప్పుడే చెప్పలేమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం లేదా పదేళ్ల తర్వాత రావొచ్చని చెప్పారని సమాచారం.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article