Breaking News

వినియోగదారులపై అకాల వర్షాల ప్రభావం

 

బాన్సువాడ, ఏప్రిల్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్ళు చల్లగా వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. అకాల వర్షాల దెబ్బతో కూరగాయల పంటలక తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడులు తగ్గిపోయి మార్కెట్‌లో కొరత ఏర్పడింది.

వినియోగదారులనుంచి కొనుగోలు పెరగడంతో సరిపడా మార్కెట్లో కూరగాయలు అందుబాటులో లేకుండాపోయాయి. ముఖ్యంగా స్తానికంగా సాగయ్యే ఆకుకూరలు, తీగజాతి కూరలు, ఉల్లిగడ్డలు అకాల వర్షాలకు తీవ్ర నష్టం కలిగింది. దీంతో దిగుబడి తగ్గిపోయి మార్కెట్లో కొరత ఏర్పడింది. ఇటీవల వరకు కొంత ధరలు దిగివచ్చినా ప్రస్తుతం అమాంతంగా పెరిగాయి.

పెళ్ళిళ్ళ సీజన్‌తో ధరలపై ప్రభావం :

ప్రస్తుతం పెళ్ళిళ్ళు, విందుల సీజన్‌ ప్రారంభం కావడంతో కూరగాయలకు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు దళారులు ధరలు పెంచుతూ వినియోగదారులను అందినకాడికి దోచుకుంటున్నారు. కొందరు ఇతర ప్రాంతాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రవాణా, కూలీల ఖర్చులు లెక్కగట్టి వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. ధరలు పెరగడంతో సామాన్యులు కూరగాయల కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

7 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం పంట నుండి సుమారు 7 లక్షల మెట్రిక్‌ ...

Comment on the article