Breaking News

ఏఐవైఎఫ్‌ ఛలో హైదరాబాద్‌ పోస్టర్ల ఆవిష్కరణ

 

కామారెడ్డి, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 11న చేపట్టిన ఛలో హైదరాబాద్‌ పోస్టర్లను ఏఐఎస్‌ఎప్‌, ఏఐవైఎప్‌ నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని కార్యరూపం దాల్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏవేవో కారణాలు చెబుతూ ఉద్యోగాలు ఇవ్వకుండా కావాలనే దాటవేస్తున్నారని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందని జిల్లా స్థాయి ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయడానికి ఎలాంటి అడ్డంకులు లేకున్నా ఇంతవరకు నియామకాలు చేపట్టకపోవడం గర్హణీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరి మార్చుకొని హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు భానుప్రసాద్‌, దశరథ్‌, సుధీర్‌, అరుణ్‌, రవి, పృథ్వి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article