Breaking News

మంత్రికి కారోబార్ల వినతి

 

నిజామాబాద్‌, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన డిమండ్లను పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కాంట్రాక్టు కారోబార్లు శనివారం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సుదీర్ఘంగా సమ్మె చేపట్టిన కారోబార్ల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవాలని వారు మంత్రికి విన్నవించారు. కాంట్రాక్టు కారోబార్లను పర్మనెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం 15 వేల మంది కారోబార్లకు 8 వేల నుంచి 12 వేలకు ఎస్‌టిడిల ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న సౌకర్యాలు తమకు కూడా కల్పించాలని వారన్నారు.

ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను వెంటనే కారోబార్లతో భర్తీచేయాలని మంత్రికి విన్నవించారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ పోస్టు ద్వారా పంచాయతీ శాఖ మంత్రికి సమస్యలు తెలియజేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్‌.శ్యాం, కార్యదర్శి రాజేశ్వర్‌, సాయన్న, ఎస్‌.సుధాకర్‌, చిన్నయ్య, భాస్కర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article