Breaking News

ఓటరు జాబితాకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి

 

– కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌

నిజామాబాద్‌ అర్బన్‌, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10న నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల పోలింగ్‌ కేంద్రాల్లో బిఎల్‌వోలకు వర్కు కేటాయించిన కేంద్రాల్లో ఉండి ఓటరు జాబితాల్లో పేర్లు మార్పులు, చేర్పులు, అలాగే కొత్తగా నమోదు చేసుకోవడానికి ఫారం-6 ఇచ్చి వివరాలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో నిజామాబాద్‌ పట్టణ బిఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు.

గతంలో వెరిఫికేసన్‌ సందర్భంగా ఓటర్లకు సంబంధించి ఓటర్ల వివరాలు పరిశీలించాలని కూడా ఆయన సూచించారు. ఓటర్లుగా అర్హులైన వారు ప్రస్తుతం ఏ పోలింగ్‌ స్టేషన్‌లో ఉంటే ఆ చిరునామా నుంచే వారి పేర్లు నమోదు చేయించాలని సూచించారు. ఆధార్‌ నెంబరు ఇవ్వకుండా ఉండి ఓటర్లుగా నమోదు కాని వారికి సంబంధించి ఆధార్‌ నెంబరు తీసుకోవాలని సూచించారు. కొత్తగా నమోదు చేసుకొని వారు కూడా ఆధార్‌ నెంబరు మొబైల్‌ నెంబరు తప్పకుండా ఇవ్వవలసి ఉంటుందని ఆయన తెలిపారు.

పాత పోలింగ్‌ స్టేషన్‌ నెంబరు కొత్త పోలింగ్‌ స్టేషన్‌ నెంబరు మరియు సరిగా పరిశీలించాలని సూచించారు. ఆధార్‌ కార్డు లేనివారు మీసేవా సెంటర్లలో పూర్తి వివరాలు ఇచ్చి ఫోటో దిగిన పిదప ఐడి నెంబరు పొందిన రసీదును ఇచ్చి కొత్త ఓటర్లు పేర్లు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. సెక్టోరియల్‌ ఆఫీసర్లు, పిడి మెప్మా, పిడి ఐసిడిఎస్‌లకు బిఎల్‌వోలందరు విదులకు హాజరయ్యేలా చూడాలని కలెక్టర్‌ తెలిపారు. బిఎల్‌వోలంతా 12వ తేదీ సాయంత్రానికల్లా అన్ని పత్రాలు పూర్తిచేసి సమర్పించాలని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, ఐకెపి పిడి వెంకటేశం, ఆర్డీవో యాదిరెడ్డి తదితరులున్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article