Breaking News

నీరు, గాలి, తిండి స్వచ్చంగా ఉంటేనే ఆరోగ్యం

 

– వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిసరాలు శుభ్రంగా ఉంటేనే కుటుంబాల్లో అనారోగ్యాలు దూరమవుతాయని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పకుండా నిర్మించుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం స్తానిక నూతన అంబేడ్కర్‌ భవన్‌లో నగరపాలకసంస్థ, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్చభారత్‌- స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా యుజిడిలేని ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి లబ్దిదారులకు మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, నగరంలో యుజిడి లేని ప్రాంతాల్లో సుమారు 6 వేలకు పైగా కుటుంబాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, ఇందులో పేదల వివరాలను విచారించి వారికి 12 వేల రూపాయలతో మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి మంజూరు పత్రాలు జారీచేయడం జరుగుతుందని, వాటి నిర్మాణం విడతలనుట్ణ బట్టి నిధులు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంటేనే అనారోగ్యాలు దరికి రావన్నారు. తాగేనీరు, పీల్చే గాలి, తినే తిండి శుభ్రంగా ఉంటేనే ఆ కుటుంబంలోని వ్యక్తులకు రోగాలు రావన్నారు. ప్రతి గ్రామంలో అన్ని కుటుంబాల్లో మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని ఉపయోగించుకుంటూ, బహిరంగ మల విసర్జన లేనపుడే గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయని, తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుందన్నారు.

వచ్చే మూడున్నరేళ్లలో ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించడం ద్వారా మహిళలు నీళ్లకై వీదుల వెంట బిందెతో నీళ్లను తెచ్చుకునే కష్టాన్ని తీరుస్తామన్నారు. ఇందుకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించడానికి పనులు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌, నగర మేయర్‌ ఆకుల సుజాత, కమీషనర్‌ వెంకటేశ్వర్లు, మెప్మా పిడి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

ముగ్గురిపై పిడి యాక్టు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 5 వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోలో ...

Comment on the article