Breaking News

ఆర్టీసి జేఏసి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన కార్మికులు

 

నిజామాబాద్‌ అర్బన్‌, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి కార్మికుల సమ్మె నానాటికి తీవ్రమవుతోంది. కార్మికులు పెద్ద సంఖ్యలో సమ్మె చేస్తుండడంతో ఆర్టీసిపై పెనుభారం పడుతుంది. సమ్మె విఫలం చేయడానికి యాజమాన్యం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినా ఫలితం కనిపించలేదు. కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడమే కాక ఆందోళనలో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. అయితే సంస్థ ఉన్నతాధికారులు మొండి వైఖరి అవలంబిస్తూ ఎలాంటి లాభాలు లేకున్నా 150 ప్రయివేటు బస్సులను, 40 ఆర్టీసి బస్సులను నడిపించినా ఫలితం శూన్యమైంది.

సమ్మె ప్రారంభమై 4వ రోజు చేరుకున్నా ఆర్టీసికి కోట్ల నష్టం వాటిల్లినట్టు అదికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని 1వ డిపో, 2వ డిపో కార్మికులు జేఏసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నుంచి బస్టాండ్‌లో బతుకమ్మ ఆడి ఎండికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, ఆర్టీసి, జేఏసి ఆద్వర్యంలో ఆర్‌ఎం కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్‌ ఇపుడు ఆ మాట మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 43 శాతం ఫిట్‌మెంట్‌ కోసమే తాము సమ్మెలోకి వచ్చామని స్పష్టం చేశారు. గత రెండేళ్ళుగా తాము పోరాడుతున్నా పాలకులు పట్టించుకోలేదని, ఇపుడు తెలంగాణలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తే కేసీఆర్‌ ప్రభుత్వం కూడా కార్మికులను నట్టేట ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు. జేఏసి ప్రతినిధులు ఆనంద్‌, వందేమాతరం శ్రీనివాస్‌, సయ్యద్‌ అహ్మద్‌, సంజీవ్‌, సాయిబాబా, అంజయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article