Breaking News

12వ సాయంత్రం కల్లా ఆధార్‌ నివేదికలు పూర్తిచేయాలి

 

– కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌

నిజామాబాద్‌ అర్బన్‌, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ బూత్‌లెవల్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆదివారం కలెక్టర్‌ నగరంలోని శంకర్‌భవన్‌, ఐటిఐ, మాణిక్‌భవన్‌, పద్మశాలి వసతి గృహం, అలాగే ఎంపిడివో కార్యాలయంలోని 76,77,88,89,95,96,97,98, పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్న స్పెషల్‌ క్యాంపు శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా బిఎల్‌వోలకు పలు సూచనలు చేశారు.

ఆధార్‌నెంబర్లు, మొబైల్‌ నెంబర్లు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. డోర్‌లాక్‌ ఉన్న ఇళ్లకు సంబంధించి సోమ, మంగళ వారాల్లో ప్రతి ఇంటికి వెళ్లి మరోసారి వెరిఫికేషన్‌ చేసి ఆధార్‌నెంబర్లు, మోబైల్‌ నెంబర్లు తీసుకోవాలని, జాబితాలో నమోదు చేయాలని సూచించారు. 12వ తేదీ సాయంత్రం అన్ని ప్రాంతాల్లో నివేదికలు తహసీల్దార్‌లకు అందజేయాలని తెలియజేశారు.

కొత్త ఓటర్ల నమోదు సవరణలకు సంబంధించి వివరాలు నివేదికలు వెంటనే తహసీల్దార్‌కు అందజేయాలన్నారు. అందిన వివరాలు డాటా ఎంట్రీని కంప్యూటర్‌ ఆపరేటర్లతో సత్వరమే పూర్తిగా నమోదు చేయించాలని తహసీల్దార్‌ రాజేందర్‌కు కలెక్టర్‌ ఆదేశించారు. డూప్లికేట్‌ ఓటర్లు దృష్టికి వస్తే వెంటనే జాబితానుంచి పేర్లు తొలగించాలని సూచించారు. ఈ పర్యటనలో ఆర్డీవో యాదిరెడ్డి, డిఎం రేఖ, తదితరులున్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article