మెడికల్‌ సేల్స్‌ రిప్రజంటేటివ్‌ల ర్యాలీ

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటీకరణ, కార్మిక చట్టాల్లో సవరణలు వ్యతిరేకిస్తూ బుధవారం తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజంటేటివ్‌ యూనియన్‌ ఆద్వర్యంలో కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మోడి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే కార్మికులకు కనీస వేతనాలు కల్పించాలని, సామాజిక భద్రతకు పెద్ద పీట వేయాలని, కార్మిక చట్టాల సవరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పట్టణంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రాజేందర్‌, సతీష్‌, రవీంద్ర, సంతోష్‌, రాజగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆవిర్భావ కానుకగా రూ. 25 కోట్లు ఇవ్వండి

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జర్నలిస్ట్‌ కుటుంబాల‌ను కరోన కష్టకాలంలో ఆదుకోవడానికి ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *