Breaking News

పోషకాహారంపై గర్భిణీలు, బాలింతలకు అవగాహన

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోషకాహార వారోత్సవాల్లో భాగంగా మంగళవారం గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలకు పోషకాహారం పట్ల అవగాహన కల్పించారు.

అంగన్‌వాడి ప్రతినిదులు, ఉపాధ్యాయులు పోషకాహారం గురించి వివరించారు. ఆకుకూరలు, పచ్చ కూరగాయలు, పాలు, పండ్లు, నువ్వులు, బెల్లం, తదితర ఆహార పదార్థాలను సమ పాళ్ళలో తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు లభిస్తాయని, వాటిని సంపూర్ణ ఆహారం అంటారని సూచించారు. ఇవి తీసుకోవడం వల్ల గర్భిణీలకు బరువు పెరగడంతో పాటు బాలింతలకు ముర్రుపాలతో పాటు తల్లికి, బిడ్డకు ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ఆరునెలల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం ఇవ్వాలని, కిషోర బాలికలు ఐరన్‌ మాత్రలతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడి సూపర్‌వైజర్లు అరుణ, రాజమణి, రుక్మిణి కుంట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *