Breaking News

అలరించిన విద్యార్తుల యోగా విన్యాసాలు

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గంజ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్తులు చేసిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మై విలేజ్‌ మాడల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సహజ ఆనంద యోగా గురుజీ ఆచార్య రమేశ్‌ నేతృత్వంలో వారంరోజులుగా పాఠశాలలో విద్యార్థులకు యోగా విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నారు. గురూజీ నేర్పిన యోగాసనాలు విద్యార్తులు చక్కగా ప్రదర్శించారు.

అనంతరం తల్లిదండ్రులు, గురువులకు కాళ్లు కడిగి పాద పూజ చేయించారు. విద్యార్థులకు యోగాతోపాటు మానవతా విలువలు, సంస్కారం గురించి నేర్పినట్టు ఆచార్య రమేశ్‌ తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఎంఇవో వెంకట్రాంరెడ్డి, శంకర్‌, ఫౌండేషన్‌ వ్యవస్తాపకులు బాల్‌రాజ్‌గౌడ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డిలో స్వాగత తోరణం

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో ప్రధాన రహదారి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *