Breaking News

మత్తులేక లొల్లి… లొల్లి….

 

– కల్తీకల్లులేక ఆసుపత్రి పాలవుతున్న కల్లుప్రియులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్లుల్లో కల్తీ చేసే రసాయనాలను నియంత్రించేందుకు గత కొంత కాలంగా ఆబ్కారీ అధికారులు దాడులు చేయడంతో కల్లు తయారీదారులు మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించారు.

దీంతో మత్తుకు బానిసలైన కల్లు ప్రియులపై ఈ ప్రభావం పడి మత్తులేక చిత్తవుతున్నారు. నిద్రలేమి, మూర్చ, పిచ్చి గా ప్రవర్తించడం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో కామారెడ్డి డివిజన్‌లోని ఆయా గ్రామాలకు చెందిన కల్లు ప్రియులు సర్కారు దావఖాన్లో చేరుతున్నారు. గత పదిరోజుల్లో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలోనే 37 మంది కల్లు ప్రియులు మంచానపడి చికిత్స పొందుతున్నారు.

కల్లులో రసాయనాలు, మత్తు పదార్థాలు కలుపుతూ ఇన్నాళ్లు జనాన్ని మత్తులో ముంచి ఇపుడు బయటకు తీయడంతో కల్లు ప్రియులు ఆసుపత్రుల పాలవుతున్నారు. కల్తీకల్లును నిషేదించాలని అనుకున్న పక్షంలో ముందస్తు జాగ్రత్తగా ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ముందస్తు చికిత్సలు ఇచ్చి, కల్లు ప్రియులకు అవగాహన కల్పించి ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రోజురోజుకు ఆసుపత్రిలో కల్తీకల్లు బారినపడి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సంఖ్య రాబోయే కాలంలో మరింతగా పెరిగే అవకాశముంది. పిచ్చిగా వ్యవహరిస్తూ వైద్యానికి సహకరించకుండా కల్లుప్రియులు ఆసుపత్రిలో హంగామా చేస్తున్నారు. కామారెడ్డి ఆసుపత్రిలో మానసిక వైద్య నిపుణులు లేకపోవడంతో సమస్య జటిలమవుతుంది. వీరిని కూడా జిల్లా కేంద్రానికి తరలించాల్సిన అవసరమేర్పడుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోగుల పరిస్థితి ఏంటి, వారికి చికిత్స ఎలా అనేది ప్రశ్నగానే మిగులుతుంది.

Check Also

కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఆర్టీసీ సంస్థ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *