Breaking News

భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేసిన ఆశలు

 

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 14 రోజులుగా నిరవదిక సమ్మె చేస్తున్న ఆశల సమ్మె మంగళవారంతో 14వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఆశ వర్కర్లు బస్టాండ్‌ ఎదుట భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పక్షం రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. తమకు నెలసరి రూ. 15 వేల వేతనం చెల్లించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, ప్రమాదబీమా వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు శోభారాణి, జ్యోతి, గంగాలక్ష్మి, స్వప్న, దీప్తి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *