Breaking News

విషజ్వరాలకు పారిశుద్యలోపమే కారణం

 

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ప్రబలుతున్న విషజ్వరాలు డెంగ్యూ, మలేరియాలకు పారిశుద్య లోపమే ప్రధాన కారణమని వైద్య బృందం పేర్కొంది. ఈ మేరకు డిచ్‌పల్లి మండలం తిర్మన్‌ పల్లి గ్రామంలో మంగళవారం వైద్యుల బృందం పర్యటించి వీధులను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

చాలా చోట్ల మురికి నీరు నిలువ ఉండడం, పందులు స్వైర విహారం చేయడం, దోమలు వ్యాపించడం వంటి పరిస్థితులు గమనించారు. వీటి కారణంగానే విష జ్వరాలకు కారణమవుతున్నాయని నిర్దారణకు వచ్చారు. ఇళ్లల్లోని ప్రజలు చెత్త, చెదారాన్ని ఎక్కడ పడితే వేయడం కాకుండా గ్రామ శివారు ప్రాంతంలో వేయాలని సూచించారు. పరిసరాలను, నీటి ట్యాంకుల వద్ద, బట్టలు ఉతికే ప్రదేశాల్లో, శుచిని పాటించాలని, శుభ్రమైన పదార్థాలను, శుద్దమైన నీటిని తాగాలని పేర్కొన్నారు. తద్వారా వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని అన్నారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌, హెల్త్‌ అసిస్టెంట్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఆర్టీసీ సంస్థ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *