వంట వార్పుతో ఆశల నిరసన

 

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలో బుధవారం ఉదయం తహసీల్‌ కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లు వివిధ రకాల నిరసనలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు.

నిరవధిక సమ్మెకు ఏఐకెఎంఎస్‌ ఆధ్వర్యంలో మద్దతు తెలుపుతూ జిల్లా సహాయ కార్యదర్శి సి.హెచ్‌.సాయాగౌడ్‌ మాట్లాడారు. ఆశల సమస్యలను ప్రభుత్వం గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలన్నారు. కనీస వేతనం 15 వేలు, టిఎ, డిఎలు, ప్రమాద బీమా, పిఎఫ్‌, ఇఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆశల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్‌ నాయకులు అమృతాపూర్‌ గంగాధర్‌ అన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టియు నాయకులు బి.కిషన్‌, చాంద్‌పాషా, శ్రీను, ఆశ వర్కర్లు దీప్తి, సరిత, ప్రమీల, గంగాలక్ష్మి, జ్యోతి, శోభారాణి, ఆయా గ్రామాల ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నియమాలు ఉల్లంఘిస్తే జరిమానా

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్ అమలుకు జిల్లా స్థాయి స్పెషల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *