Breaking News

మధ్యాహ్న భోజనం వికటించి 34 మందికి అస్వస్థత

 

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దామరంచ గ్రామంలోగల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 34 మంది విద్యార్తులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సుమారు 250 మందికి రోజు అందిస్తున్నారు.

కాగా శనివారం 212 మంది భోజనం చేశారు. గంట సమయంతర్వాత విద్యార్తులకు వాంతులు, విరేచనాలు కావడంతో గమనించిన స్తానికులు బాన్సువాడ ఏరియా ఆసుత్రికి తరలించినట్టు ప్రధానోపాద్యాయులు మురళి తెలిపారు. ప్రస్తుతం 34 మంది అస్వస్తతకు గురై ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నారని తెలిపారు. వెంటనే స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలందించాలని, ఏమాత్రం అజాగ్రత్తగా పనికిరాదని అన్నారు. అలాగే ఈ సంఘటనకు సంబంధించిన కారణాలు తెలుసుకోవాలని అన్నారు. బీర్కూర్‌ ఎంపిపి మల్లెల మీణ, హన్మంతు, జడ్పిటిసి కిషన్‌ నాయక్‌, గ్రామ సర్పంచ్‌ శంకర్‌, ఎంపిటిసి గంగాధర్‌లు అక్కడికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. బాన్సువాడ ఎంపిపి రేష్మ ఎజాజ్‌, మండల తెరాస నాయకులు నార్ల సురేశ్‌, కృష్నారెడ్డి, బీర్కూర్‌ మండల పార్టీ అధ్యక్షులు పెర్క శ్రీనివాస్‌ విద్యార్తులను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు.

Check Also

పెంపుడు కుక్క‌ల‌కు వ్యాధి నివారణ టీకాలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6 వ తేదీన జరుపుకునే ‘‘ప్రపంచ జూనోసిస్‌ ...

Comment on the article