Breaking News

హై స్కూలు విద్యార్థులకు కంటి పరీక్షలు

 

నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని వసతిగృహాల్లో గుర్తించిన విద్యార్తులకు కంటి పరీక్షలు చేయించి, అవసరమున్నవారికి ఉచితంగా కళ్లజోళ్లను అందించనున్నట్టు జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శనివారం కలెక్టర్‌ చాంబరులో నిర్వహించిన జిల్లా వంధత్వ నివారణ సంస్థ సమావేశంలో మాట్లాడారు.

జిల్లాలోని వసతి గృహాల్లో గుర్తించిన 687 మంది విద్యార్తులకు ఈనెల 25,26 తేదీల్లో ఉచిత కళ్లజోళ్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. కంటి వైద్య నిపుణుల పర్యవేక్షణలో కళ్లజోళ్లను అందజేయాలని అన్నారు. 2015-16లో జిల్లాలో 15 వేల మందికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికి వరకు 6126 ఆరేషన్లు చేసినట్టు తెలిపారు. ఈ క్యాటరాక్ట్‌ ఆపరేషన్లకు పేషెంట్లను గుర్తించేందుకు స్వచ్చంద సంస్థల సహకారంతో శిబిరాలు నిర్వహించాలని సూచించారు. గతంలో నిర్వహించిన ఆపరేషన్ల బకాయిలు చెల్లించడానికి కావాల్సిన రూ. 28 లక్షల నిధుల మంజూరుకై ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలిపారు. హైస్కూలు విద్యార్తుల అందరికి కంటి పరీక్షలనిర్వహణకు షెడ్యూల్‌ను రూపొందించాలని డిఇవోను ఆదేశించారు. వసతి గృహాల్లో విద్యార్తులు చదివేందుకు అవసరమైన కనీస వెలుగును నిర్దారించేందుకు కొన్ని వసతి గృహాలను సందర్శించాలని అంధత్వ నివారణ కమిటీ సభ్యులను కలెక్టర్‌ కోరారు. సమావేశంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ డిపిఎం జి.వసంత, టెక్నికల్‌ అడ్వైజర్‌ కె.రవిశేఖర్‌ రావు, డాక్టర్‌ భీంసింగ్‌, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌, తదితరులున్నారు.

Check Also

నగరంలో మన్యం వీరుడి జయంతి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 123వ జయంతిని నిజామాబాద్‌ ...

Comment on the article