Breaking News

విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంచుకోండి

 

– సైకాలజిస్టు వీరేందర్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్తులు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని, లక్ష్య సిద్దికై నిరంతరం కృషి చేయాలని ప్రముఖ సైకాలజిస్టు వీరేందర్‌ పిలుపునిచ్చారు. శనివారం వ్యక్తిత్వ వికాసంపై జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ మన ప్రాంత విద్యార్తులు ఎక్కువగా ఆత్మ న్యూనతతో బాధపడడం విచారకరమన్నారు.

అందరూ కూడా సమానమైన తెలివితేటలతో జన్మిస్తారని, ఎవరు కూడా తమను తాము తక్కువగా అంచనా వేసుకోవద్దన్నారు. విద్యార్తులు తాము అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ప్రణాళిక బద్దంగా కృసి చేయాలన్నారు. మంచి కథలతో, ఉదాహరణలతో, పొడుపు కథలతో, స్ఫూర్తి దాయక ఉదాహరణలతో, ఆధ్యాత్మిక భావాలతో ప్రసంగించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ వీరేందర్‌ కృసిని అభినందించారు. విద్యార్తులు గొప్పవారి జీవిత కథలు చదివి స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు. ఆచార్యులు సత్యనారాయణచారి, ప్రవీణబాయి, జాన్సన్‌, సమత, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఐదు మీటర్ల దూరం ఉండాలి

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మంజూరు చేసిన రైతు వేదికల‌ నిర్మాణం గురువారం ...

Comment on the article