Breaking News

శిక్షణకు హైదరాబాద్‌కు జూనియర్‌ అసిస్టెంట్లు .

 

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందించేందుకు హైదరాబాదులోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్లకు 4 వారాల శిక్షణ ఇప్పించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ యోగితా రానా ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌, జిల్లా ఎంపిక కమిటీల రిక్రూట్‌మెంట్‌ లేదా కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన జూనియర్‌ అసిస్టెంట్లకు రెసిడెన్షియల్‌ కోర్సుగా ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు.

అయితే మూడు సంవత్సరాలలోపు ఉన్న సర్వీసు ఉన్నజూనియర్‌ అసిస్టెంట్లకే ఈ శిక్షణ ఉంటుందని అన్నారు. తమ కార్యాలయాల పరిధిలోఉన్న జూనియర్‌ అసిస్టెంట్లను ఈ శిక్షణకు పంపాలని జిల్లా అధికారులకు సూచించారు. శిక్షణకు పంపిన ఉద్యోగుల వివరాలు ప్రతిని పంపాలని కోరారు. ఈ శిక్షణ మూడు బ్యాచులుగా ఉంటుందని చెప్పారు. మొదటి బ్యాచు ఈనెల 28 నుంచి అక్టోబర్‌ 31 వరకు, రెండవ బ్యాచుకు నవంబర్‌ 2 నుంచి 30వరకు, మూడవ బ్యాచుకు డిసెంబరు 1నుంచి 31 వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్త, కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆర్తిక అంశాలు, సర్వీసు రూల్సు, కార్యాలయాల లెక్కలు, బేసిక్‌ కంప్యూటర్స్‌, వ్యవహార శైలి, సిసిఎ రూల్సు తదితర అంశాలపై ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. కొత్తగా నియామకాలు పొందిన ఉద్యోగుల సర్వీసుకు ఈ శిక్షణ చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.కావున అన్ని శాఖల అధికారులు తమ జూనియర్‌ అసిస్టెంట్లకు ఈశిక్షణ ఇప్పించాలని కలెక్టర్‌ సూచించారు.

Check Also

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ ...

Comment on the article