Breaking News

గుండె జబ్బుల నివారణకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి

 

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవులు గుండె జబ్బులకు గురికాకుండా ఉండడానికి వారి అలవాట్లను, వారు తీసుకునే ఆహారంలో మార్పులు చేయాల్సిన అవసరమెంతైనా ఉందని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా సూచించారు.

మంగళవారం నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ గుండె దినోత్సవ సందర్బంగా కార్డియాలజిస్టు ప్రగతి ఆసుపత్రి సంస్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ దేశాలు మన దేశాన్ని గుండె జబ్బులకు నిలయంగా వర్ణించడం జరిగిందని, ఈ ప్రమాద స్తాయి నుంచి మనం బయటపడాలంటే ప్రతిరోజు 45 నిమిషాల పాటు నడవాలని, అంతేగాకుండా తక్కువ శాతం గల కొవ్వు పదార్థాలను తీసుకోవాలని, తాజాపండ్లను, కూరగాయలను ఎక్కువగా వాడాలని, దూమపానాన్ని, మద్య పానాన్ని నిషేదించాలని ఈసందర్భంగా తెలిపారు. బరువు తగ్గిస్తాం గుండెను కాపాడుకుందాం అనే నినాదంతో డాక్టర్లు, విద్యార్తులు, ప్రజలు పాటిటెక్నిక్‌ కళాశాల నుంచి ప్రగతి ఆసుపత్రి వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పి సిఇవో మోహన్‌లాల్‌, ప్రగతి ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్‌ లక్ష్మారెడ్డి, డాక్టర్‌ కొండల్‌రావు, డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌, డాక్టర్‌ రాజేందర్‌, డాక్టర్‌ సుధీర్‌ నాయక్‌, 50వ వార్డు కార్పొరేటర్‌ చాంగుబాయి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ ...

Comment on the article