Breaking News

తహసీల్‌ కార్యాలయానికి తాళం వేసి ఆశల ఆందోళన

 

– పలువురి అరెస్టు

కామారెడ్డి, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఆశలు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా సోమవారం ఆశ వర్కర్లు కామారెడ్డి తహసీల్‌ కార్యాలయానికి తాళం వేసి గేటు ముందే ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు.

ఈ సందర్బంగా సిఐటియు డివిజన్‌ కార్యదర్శి రాజలింగం, ఆశ మండల నాయకులు మమత, వరలక్ష్మి మాట్లాడుతూ గత 34 రోజులుగా ప్రజాస్వామ్య పద్దతిలో సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అందుకే తహసీల్‌ కార్యాలయానికి తాళం వేసి ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అసెంబ్లీలో ఈ విషయాన్ని చర్చించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టకుంటే మరిన్ని ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఆడబిడ్డల సమస్యలను రోడ్డుపై వదిలి వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆశ ప్రతినిదులు మంజుల, లక్ష్మి, సుజాత, విజయ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నష్టపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తాం

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగారంలో గల‌ డబుల్‌ బెడ్రూమ్‌ సైట్‌ను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article