Breaking News

8 గ్రామాల్లో గ్రామ సభలు

 

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని 8 గ్రామాల్లో సోమవారం గ్రామసభలు నిర్వహించారు. తిర్మన్‌పల్లి, దూస్‌గాం, ఇందల్వాయి, మిట్టాపల్లి, సుద్దపల్లి, బర్దిపూర్‌, ధర్మారం గ్రామాల్లో ఉన్న సమస్యలపై గ్రామ సభ నిర్వహించగా తిర్మన్‌పల్లి గ్రామంతో పాటు పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని గ్రామస్తులు సభకు వచ్చిన అధికారులకు విన్నవించారు.

తిర్మన్‌పల్లిలో మహిళలు ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను నిలదీశారు. పనిచేసిన డబ్బులు సరిగా రావడం లేదని, తన ఇష్టారాజ్యంగా వర్క్‌ మస్టర్లను రాస్తున్నాడని ఆరోపించారు. ఏపివో అధికారులు తగిన చర్యలుతీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, గ్రామస్తులు, ఇవో పిఆర్‌డి శ్రీనివాస్‌రావు, ఎండివో గోపికిషోర్‌, విద్యుత్‌శాఖ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్లు, ఎలక్ట్రిసిటి లైన్‌మెన్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article