Breaking News

అంగన్‌వాడిల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

 

బీర్కూర్‌, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడిల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మండల అభివృద్ది అధికారి మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోగల 7,8 అంగన్‌వాడి సెంటర్లను సోమవారం ఆయన పరిశీలించారు. అంగన్‌వాడి కేంద్రంలో పలు సమస్యలున్నాయన్న కార్యకర్తల వినతి మేరకు త్వరలోనే కార్యాలయం చుట్టూ ప్రహరీగోడ నిర్మిస్తామని, మౌలిక సదుపాయాల్లో భాగంగా వంటగది, మరుగుదొడ్డి, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. అంగన్‌వాడి కార్యకర్తలు బాలింతలకు, గర్భవతులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సయ్య, మల్లెల హన్మంతు, బస్వరాజ్‌ పటేల్‌ తదితరులున్నారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article