Breaking News

గ్రామ పంచాయతీ నిధుల గోల్‌మాల్‌పై విచారణ జరపండి

 

బీర్కూర్‌, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్నారం గ్రామంలో కార్యదర్శి హయ్యూం, సర్పంచ్‌ భర్త కలిసి గ్రామ పంచాయతీ నిధులు గోల్‌మాల్‌ చేశారని, వాటిపై వెంటనే విచారణ చేపట్టాలని మండలంలోని అన్నారం గ్రామస్తులు మండల అభివృద్ది అధికారి మల్లికార్జున్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

గ్రామసర్పంచ్‌ భర్త ఎటువంటి పంచాయతీ తీర్మానం లేకుండానే సుమారు లక్ష 80వేల రూపాయల నిధుల అవకతవకలు జరిపారని వినతి పత్రంలో పేర్కొన్నారు. సర్పంచ్‌ భర్త అక్రమాలకు పంచాయతీ కార్యదర్శి హయ్యూం తోడయ్యాడని, నిధుల అవకతవకల్లో వాటాలు పంచుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. విచారణ జరిపించి కార్యదర్శిని తొలగించి సర్పంచ్‌ను భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article