Breaking News

గ్రామంలో మంచినీటి సమస్యను అధిగమిస్తాం

 

బీర్కూర్‌, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో తాగునీటి సమస్య అధిగమించేవిధంగా ప్రణాళిక రూపొందించామని బీర్కూర్‌ సర్పంచ్‌ బూలియా నర్సయ్య అన్నారు. గ్రామంలో గడి వద్ద గల వాటర్‌ ట్యాంకు వాచర్‌పోవడం వల్ల మూడురోజులుగా నీరు సరిగా రావడం లేదని, సోమవారం మరమ్మతులు పూర్తిచేశామని మంగళవారం నుంచి సమృద్ధిగా నీరు లభిస్తాయన్నారు.

గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా 6,4,9 వార్డుల్లో బోర్లు వేయించి సింగిల్‌ ఫేజు మోటార్లు వేయించామని అన్నారు. గ్రామంలో తాగునీటి ట్యాంకులు నిండడానికి మంజీర నది ప్రాంతంలో రెండు బోర్లు వేశామని స్పష్టం చేశారు. 7.5 హెచ్‌పి మోటర్లతో ట్యాంకులకు అనుసంధానం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మల్లెల నాందేవ్‌, బస్వరాజ్‌, గాండ్ల సంతోష్‌, తదితరులున్నారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article