Breaking News

స్వయం ఉపాధితో సొంతకాళ్లపై నిలబడాలి

 

కామారెడ్డి, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు ప్రభుత్వం ఇచ్చే శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొంది తద్వారా సొంతకాళ్లపై నిలబడాలని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. ప్రతిభ ఎడ్యుకేషన్‌ సొసైటీ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మూడునెలలుగా శిక్షణ పొందిన విద్యార్థులకు సోమవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ జాతీయ పట్టణ జీవనోపాధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు, యువతులకు స్వయం ఉపాధి కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం చేపడుతున్నారన్నారు. శిక్షణ పొందిన వారు కుటుంబాన్ని పోషించుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి వారి ప్రగతికి దోహదపడతామన్నారు. శిక్షణ పొందినవారు దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమీషనర్‌ పఠాభి, డైరెక్టర్‌ రాజేందర్‌, బ్యూటీషియన్లు వెంకటలక్ష్మి, 60 మంది శిక్షణ విద్యార్థులు తదితరులున్నారు.

Check Also

నష్టపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తాం

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగారంలో గల‌ డబుల్‌ బెడ్రూమ్‌ సైట్‌ను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article