Breaking News

ప్రబుత్వ పాలనావిభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

 

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి ఆధునిక యుగంలో ఉపాధ్యాయుల పాత్ర మరిన్ని సవాళ్లతో కూడుకున్నదిగా మారిందని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన విధంగా సోమవారం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ టీచింగ్‌ అనేది టెక్నాలజి యుగంలో, మారుతున్న కాలంలో మరింత సంక్లిష్టమైన సవాల్‌గా మారిందన్నారు. ప్రపంచం ఒక గ్లోబల్‌ విలేజ్‌గా మారుతున్నది. విద్యార్తుల అవసరాలు, అభిప్రాయాలు, దృక్పథాలు మరింత సంక్లిష్టంగా మారుతున్న క్రమంలో ఉపాధ్యాయ వృత్తి నైపుణ్యాలు మరింతగా పెరగాల్సిన అవసరముందన్నారు. అధ్యాపకులు నిరంతరం తమ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూనే, తమ జ్ఞాన తృష్ణను నిలుపుకోవాల్సి ఉంటుందని ప్రొపెసర్‌ లింబాద్రి అన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ పాలనశాస్త్ర విద్యార్తులను, అకడమిక్‌ కన్సల్టెంట్‌లు డాక్టర్‌ రామలింగం, డాక్టర్‌ నర్సయ్యలను ప్రత్యేకంగా అభినందించారు.

Check Also

క్యాంపు కార్యాల‌యంలో హరితహారం

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ...

Comment on the article