Breaking News

కంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయరాదు

 

– జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా

రెంజల్‌, అక్టోబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య సమస్యలు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా తెలిపారు.

శుక్రవారం కమ్మర్‌పల్లి మండలం మానాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. నేడు మీ గ్రామ ప్రజల ఆరోగ్యం నిమిత్తం ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో స్త్రీలకు, చిన్నపిల్లలకు, కంటి జబ్బులకు, గుండెకు, దంతాలకు సంబంధించిన డాక్టర్లచే వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకొని ఆరోగ్యవంతులు కావాలనికోరారు. ఈ గ్రామంలో 40 మంది కంటి శుక్లాల వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించి కంటి డాక్టర్లను రప్పించడం జరిగిందని, వారిచే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అత్యవసరమైన వారికి హైదరాబాద్‌, నిజామాబద్‌ పంపించడం జరుగుతుందని ఇందుకోసం అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే భరిస్తుందని, కంటి ఆపరేషన్లు తప్పకుండా చేయించుకోవాలని, వాయిదా వేయరాదని ప్రజలకు సూచించారు. శిబిరంలో ప్రగతి ఆసుపత్రి, శివసాయి ఆసుపత్రి, హీరా ఆసుపత్రి నిజామాబాద్‌వారు, అలాగే అఖిల ఆసుపత్రి, అపర్ణ ఆసుపత్రి ఆర్మూర్‌వారు, భీమ్‌గల్‌ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ ...

Comment on the article