Breaking News

పోలీసుల ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 

కామారెడ్డి, అక్టోబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమార్‌పేట్‌ గ్రామంలో ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. శిబిరంలో 400 మంది గ్రామస్తులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ భాస్కర్‌ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటుగా వారి కోసం ఆరోగ్య శిబిరం లాంటి స్వచ్చంద కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా గ్రామంలోని యువ క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్‌లు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని డిఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు, పోలీసు సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు.

Check Also

భూములు గుంజుకుంటే ఉద్యమిస్తాం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సిపిఎం పార్టీ అద్వర్యంలో కామారెడ్డి మండలం గూడేం ...

Comment on the article