Breaking News

తెవివిలో కాంగ్రెస్‌ నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం

 

డిచ్‌పల్లి, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో బుదవారం కాంగ్రెస్‌ నాయకుల దిష్టిబొమ్మ దగ్దం చేశారు. కార్యక్రమం టిఎస్‌జేఏసి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌అలీ, మాజీ ఎంపి మధుయాష్కీగౌడ్‌, సురేశ్‌రెడ్డిలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌, హరీష్‌రావు, కెటిఆర్‌, ఎంపి కవితలను విమర్శించేనైతిక విలువలు లేవని టిఎస్‌జేఏసి ఛైర్మన్‌ యెండల ప్రదీప్‌ అన్నారు. ఈ నలుగురు కూడా తెలంగాణ కోసం జైలుమెట్లు ఎక్కినవారే వారికి ప్రజలే ఇచ్చిన పదవులని అన్నారు. వారిని వ్యతిరేకిస్తే ప్రజా వ్యతిరేకులుగా మిగిలిపోతారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల పాదయాత్ర ప్రజలకోసమైతే మీరు రాజకీయం చేయడం ఎందుకని ప్రశ్నించారు. షబ్బీర్‌అలీ, మాజీ ఎంపి మధుయాష్కీగౌడ్‌, సురేశ్‌రెడ్డిలు తెలంగాణ కోసం ఏనాడైనా జైలు మెట్లు ఎక్కారా అని విమర్శించారు. మీకు పదవులు లేకపోవడంతో ప్రజలు గుర్తుకువస్తున్నారని విమర్శలు వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా కెసిఆర్‌ ప్రభుత్వంలో డి.శ్రీనివాస్‌ కలవడం న్యాయమైన నిర్ణయమని, డి.ఎస్‌ను విమర్శించే విలువలు మీకు లేదని తెలిపారు. కార్యక్రమంలో రవినాయక్‌, అనిల్‌ నాయక్‌, లింగ్యా, శ్రీకాంత్‌, సతీష్‌, గణేష్‌, రాజు, రాందాస్‌, తదితరులున్నారు.

Check Also

తాగునీటి సమస్య ఏర్పడితే ఫోన్‌ చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో తాగునీటి సమస్యు ఎదురైతే 9154220064 నెంబర్‌కు ఫోన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *