Breaking News

కుటుంభ కలహాలతో హత్య

కుటుంభ కలహాలతో భావమరిది అతని భార్యను అతి కిరాతకంగా గడ్డపారతో కొట్టి చంపటంతోపాటు ఇతర కుటుంభ సభ్యులను తీవ్రంగా గాయపర్చిన సంఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. నిజామాబాద్ మండలం సారంగాపూర్ గ్రామంలో పీట్ల నర్సింలు అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావటం లేదని ఆమెను నరకటానికి ప్రయత్నించాడు. దీన్ని అడ్డుకుంటున్న ఆమె కుటుంభ సభ్యులపై గడ్డపారతో దాడికి దిగాడు. దాడిలో నిందుతిని బావమరిది సాయిలు, చెల్లెలు రోజాలు అక్కడికి అక్కడే మరణించారు. నిందుతుని భార్య శివమ్మ, మరదలు ఒల్లెపు లళిత, అత్త లక్ష్మి లను తీవ్రంగా గాయపరిచాడు. వీరు పెద్దగా కేకలు వేయటంతో చుట్టుప్రక్కల వాల్లు అప్రమత్తం కావటంతో నిందితుడు పారిపోటానికి ప్రయత్నించాడు. స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు గతంలో కూడా హత్యకేసులో ఉన్నట్టు సమాచారం ఉందని ఇతను దొంగతనాలకు పాల్పడుతున్నాడని సమాచారం ఉందని సీఐ మున్ని తెలిపారు. మృతులు సాయిలు, లక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు తల్లి దండ్రలేని అనాదలయ్యారని బందువులు బోరున విలపిస్తున్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *