Breaking News

ప్రశాంతంగా బి.ఈడి స్పాట్‌ అడ్మిషన్లు

 

డిచ్‌పల్లి, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో రెండు సంవత్సరాల బిఇడి 2015-16 అకడమిక్‌ సంవత్సరానికి సోమవారం రోజు ప్రశాంతంగా జరిగాయి. పూర్తి పారదర్శకతతో, మెరిట్‌, రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా స్పాట్‌ అడ్మిసన్లు నిర్వహించాలని ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు.

ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా ఈ స్పాట్‌ అడ్మిషన్లు పకడ్బందీగా నిర్వహించాలని ఆచార్య లింబాద్రి కమిటీకి ఆదేశాలిచ్చారు. నవంబర్‌ 13 వరకు అప్లికేషన్లు సమర్పించిన అభ్యర్థుల నుంచి అర్హులైన వారి జాబితాను ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ స్క్రూటిని తర్వాతే ఆమోదించినట్టు రిజిస్ట్రార్‌ వివరించారు. సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు విలువైన విద్యా సంవత్సరం వృధా కాకుండా బిఇడి లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులో స్పాట్‌ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్‌ వివరించారు. స్పాట్‌ అడ్మిషన్ల కమిటీ సభ్యులుగా అడ్మిషన్సుడైరెక్టర్‌ డాక్టర్‌ అతర్‌ సుల్తానా, డిప్యూటి డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య, బిఇడి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సమత, ప్రొఫెసర్‌ ధర్మరాజు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

19న సేవా దినోత్సవం

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ల‌యన్స్‌ డిస్ట్రిక్ట్‌ 324 డి ఆద్వర్యంలో ఈ నెల‌ ...

Comment on the article